Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Story in Telugu | Telugu stories | motivational Stories in Telugu | తెలుగు కథలు | Best Telugu stories

 

                           STORY - 1


          తెనాలి రామయ్య-నలుగురు దొంగలు



Story in Telugu | Telugu stories | motivational Stories in Telugu | తెలుగు కథలు | Best Telugu stories


>        శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాడ తెనాలి రామయ్య ఒక పండితుడుగా పని చేసేవారు. అయితే రామయ్య చాలా తెలివి ఉండేది. తన తెలివితో శ్రీకృష్ణదేవరాయలు ని మెప్పించి. చాలా బహుమతులు గెలుచుకునే వాడు. అలా ఎన్నో బహుమతులు ఎన్నో బిరుదులు గెలుచుకున్నాడు. అయితే ఒక నలుగురికి ఒక ఆలోచన వచ్చింది. ఇతను చాలా బిరుదులు బహుమతులు గెలుచుకున్నాడు కదా అతని ఇంట్లో దొంగతనం చేద్దాం అని ఆ నలుగురు తెనాలి రామయ్య ఇంటికి వెళ్లారు. తెనాలి రామయ్య ఇంట్లోనే ఉన్నాడు. తెనాలి రామయ్య ఇంటి పక్కన అతని అరటి తోట ఉంది. అ నలుగురు దొంగలు ఆ తోటలో దాక్కున్నారు.

 




>                ఆ నలుగురు దొంగలు దాక్కొని రామయ్య ఇంటికెళ్లి చూస్తున్నారు. అయితే తెనాలి రామయ్య అన్నం తినేసి చేతులు కడుక్కుని రా మని బయటికి వచ్చాడు. తెనాలి రామయ్య వచ్చింది ఆ నలుగురు దొంగలు చూడలేదు, కానీ తెనాలి రామయ్య అనుకోకుండా ఆ నలుగురు దొంగల్ని చూశాడు. తెనాలి రామయ్యకు తన ఇంటికి దొంగతనానికి వచ్చారని అతనికి అర్థం అయ్యింది. ఇంతలో ఒక ఉపాయం వేశాడు. తన భార్యను పిలిచి ఆ నలుగురు దొంగలు కి వినబడేటట్టు గా, ఏమే ఏ ఊరిలో దొంగలు చాలా మంది పెరిగిపోయారు మన దగ్గర ఉన్న నగలు మూటగట్టి ఇవ్వు అన్నాడు. అయితే దొంగలు రామయ్య అనేది విన్నారు. తెనాలి రామయ్య ఒక మూటను తీసుకొచ్చి పక్కనే ఉన్న బావిలో వేశాడు. ఆ నలుగురు దొంగలు ఆ మూట బావిలో వేస్తుంటే చూశారు. తెనాలి రామయ్య మరియు  అందరూ పడుకునే దాకా ఆ నలుగురు దొంగలు ఆ బావి కి వెళ్ళి చూస్తూ ఉన్నారు. అందరూ పడుకున్నాక ఆ నలుగురు దొంగలు ఆ బావి దగ్గరికి వెళ్లి చూశారు.


>    అందరు నీరు బావి నిండుగా ఉన్నవి. అయితే ఆ నలుగురు దొంగలు ఈ నీరు అంతా బయటికి చేసేది పోదామని అనుకున్నారు. అలా నీళ్లు చేయడం మొదలుపెట్టారు. అలా నీళ్లు బావిలో తోడుతోనే ఉన్నారు. తెనాలి రామయ్య పక్కనే ఉన్న అరటి తోట కు నీళ్లు బాగా పెట్టినవి. అలా రాత్రి అంతా చేరుతూ  ఉన్నారు. అరటి తోట కు మాత్రం నీరు ఎక్కువగా పట్టేసింది. అలా తవ్వుతూ తెల్లవారుజాము అయ్యింది. అయితే బావిలో నీరు కూడా అంతా అయిపోయింది, చివరిగా ఆ మూట కనిపించింది. నలుగురు దొంగలు ఆ మూటను విప్పి చూడగా అందులో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నవి. ఆ నలుగురు ఎంత తెలివి తక్కువ పని చేశాము మనం బావిలో ఉన్న అతని తోటకి నీరు పెట్టాను అని సిగ్గుతో తలవంచుకొని వెళ్లిపోయారు. తెనాలి రామయ్య  మాత్రం మంచి ఉపాయం చేశాడు దొంగలకే దిమ్మతిరిగే ఉపాయం వేశాడు. అలా తెనాలి రామయ్య ఇళ్ళ జరిగింది అని రాజు తో చేపి. బహుమతులు గెలుచుకున్నాడు. అంటే రాజుకు తన తెలివి తేటలు నచ్చి బహుమతులు ఇచ్చాడు.



నీతి :    ఉపాయముతో అపాయాన్ని తరిమికొట్టొచ్చు.




మీరు ఈ స్టోరీ కి మీకు నచ్చిన పేరు పెట్టి " Comment " లో ఇవ్వండి.

Post a Comment

0 Comments

Telugu Stories || Stories in Telugu || Telugu kathalu || Kathalu || కథలు || Telugie