అందం కోసం చిట్కాలు :
Part-1 :
> మొటిమలతో బాధపడేవారు పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటూ కాఫీ, టీ లకు దూరంగా ఉంటే చాలా మంచిది.
> మగ్గిన అరటిపండు సగం టీస్పూన్ పాల మీగడ 5 చుక్కల గ్లిజరిన్ 2 చుక్కల విటమిన్ ఇ ఆయిల్ కలిపి చర్మానికి పట్టిస్తే పగుళ్ళు పోతాయి.
> రెండు టేబుల్ ఫోన్లు నిమ్మకాయ నీళ్లు రెండు స్పూన్లు చింతపండు రసం సగం కప్పు వేడి చేసిన టీ నీళ్లు కలిపి షాంపు తో ఇలా చేసి ఇ తరువాత తలకు పట్టిస్తే జుట్టు వంకీలు తిరుగుతాయి.
> బాదం నూనెలో తేనెను కలిపి ముఖానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోండి ఇ ఏ క్రీములు లోషన్లు అవసరం లేకుండానే మీ ముఖం సౌందర్యగా మౌతుంది.
> పెరుగు శనగపిండి ఈ మిశ్రమాన్ని రోజు మొహానికి రాసుకుని కాసేపాగి స్నానం చేస్తే మొటిమలు పోతాయి.
> ఆముదం గ్లిజరిన్ సమాన పళ్ళల్లో కలిపి దానిని ముఖానికి పూసుకుంటే మొటిమలు వాటి మచ్చలు మాయమవుతాయి.
> మిక్సీలో కేరెట్ రసం వేసుకొని దాన్ని తరచు తాగితే చర్మం తల తల లాడుతుంటుంది.
> టమాటో నో మధ్యకు కోసి ఆ రసాన్ని ముఖానికి పోసి పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే, ఇలా చేస్తూ ఉంటే మీ ముఖము చక్కని నిగారింపు సంతరించుకుంటుంది.
> సీకాయ పొడిలో మజ్జిగ కొద్దిగా కలిపి తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
> కళ్ళ క్రింద వత్తుగా ( పేడ్స్) ఉబికి నట్లు ఉంటే బంగాళదుంప పరిగి కి కనురెప్పలకు రాస్తే కొద్ది కాలంలోనే మంచి ఫలితం వస్తుంది మీ మీ కండ్లు చూడడానికి బాగుంటాయి.
> చర్మాన్ని మృదువు గా ఉంచడానికి పెసరపిండిలో చిటికెడు పసుపు వేసి నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి ఓ రెండు చెంచాల పాలు కలిపి ఆ పేస్టుని ముఖానికి రాసుకోవాలి ఎండిపోయాక మొహం కడుక్కుంటే మాత్రం మృదువుగా అవుతుంది.
> క్యారెట్ రసం తరచు తాగుతున్న వారి చర్మం మాత్రం ఎండి ఒడిలి పోకుండా ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటుంది. అంటే ముడతలు పడకుండా ఉంటుందన్నమాట.
> ఉదయం నిద్ర లేవగానే పండ్లు తోముకునే ఓ గ్లాసు చల్లటి నీరు తాగితే మొటిమలు రాకుండా ఉంటాయి అంటే తగ్గుతాయి ఇలా ప్రయత్నించండి.
> ధవనం మరువం పుదీనా తులసి ఆకుల్ని పొడి చేసి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా సువాసనగ ఉండుటకు ఈ పద్ధతి బాగా ఉంటుంది.
> ఒక కప్పు గోధుమపిండి లో రెండు చెంచాల పసుపు రెండు చెంచాల నూనె వేసి కాస్త నీరు కూడా కలిపి పేస్ట్ లా తయారు చేసి స్నానానికి ముందు ఒంటికి పట్టించి కొద్ది నిమిషాలు నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది కాంతివంతంగా కూడా తయారవుతుంది.
0 Comments